రైతులకు గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లోకి డబ్బులు

by Ajay Maddhiboyina |

కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను ఈ నెల 20వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులను ప్రధాని మోడీ స్వయంగా విడుదల చేయనున్నారు.

రైతులకు గుడ్ న్యూస్.. రేపు ఖాతాల్లోకి డబ్బులు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన నిధులను ఈ నెల 20వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులను ప్రధాని మోడీ స్వయంగా విడుదల చేయనున్నారు. పథకం తీసుకువచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 25 సార్లు రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయగా ఇప్పుడు 26వ విడత నిధులు విడుదల చేయనున్నారు. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ లో పర్యటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్ల నిధులను ప్రధాని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా రైతులకు పంటసాయం కింద ఏడాదికి రూ.6వేలు అందిస్తున్నారు. వీటిని ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టింది. అంతే కాకుండా భారతీయపౌరుడై, చిన్న సన్నకారు రైతులకు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.

Next Story