‘దిశ’ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్: ‘భూ భారతి’లో మార్కెట్ వాల్యూస్ పునరుద్ధరణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-19 03:17:49  IST  )

భూ భారతి పోర్టల్‌లో వ్యవసాయ భూముల మార్కెట్ వాల్యూ మాయమవ్వడంపై 'దిశ' ప్రచురించిన కథనానికి రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించారు.

‘దిశ’ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్: ‘భూ భారతి’లో మార్కెట్ వాల్యూస్ పునరుద్ధరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: భూ భారతిలో మార్కెట్ వాల్యూస్ మాడ్యూల్‌ను పునరుద్ధరించారు. ఇవాళ ‘దిశ’లో ‘మార్కెట్ వాల్యూస్ మాయం’ అనే శీర్షికతో కథనంపై రెవెన్యూ అధికారుల స్పందించారు. 15 రోజులుగా భూ భారతి పోర్టల్‌లో మార్కెట్ వ్యాల్యూస్ కనిపించకపోవడం వల్ల సామన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ వాల్యూస్‌ను దాచడం వల్ల ఏం ఉపయోగం అని అడగడంతో అధికారులు రియాక్ట్ అయ్యారు. గురువారం రాత్రి వరకు కనిపించని మార్కెట్ వ్యాల్యూస్ మాడ్యూల్ శుక్రవారం పోర్టల్‌లో ఒక్కసారిగా ప్రతక్ష్యమైంది. ఇక నుంచి ఎవరి భూమి ఎంత విలువో చూసుకోవచ్చు. సేల్‌డీడ్‌కు స్టాంప్ డ్యూటీ, ఇతర ఫీజులు లెక్క కట్టే వీలు కూడా ఉంటుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్ https://bhubharati.telangana.gov.in/viewMarketValueLandStampDuty ద్వారా మార్కెట్ వాల్యూస్ తెలుసుకోవచ్చు.

Next Story