- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమావాస్య భక్తుల కష్టాలు తీరేదెన్నడో..!
అమావాస్యను ప్రతి ఒక్కరూ అశుభంగా భావిస్తారు.

దిశ, నార్కట్ పల్లి: అమావాస్యను ప్రతి ఒక్కరూ అశుభంగా భావిస్తారు. కానీ ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా నల్లగొండ జిల్లాలోని తెలంగాణ శ్రీశైల క్షేత్రం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి మాత్రం అమావాస్య రోజున వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఈరోజు స్వామివారిని దర్శించుకుని సన్నిధిలో నిద్రిస్తే అమావాస్య అంధకార చీకటిలో అశుభాలు తొలగి శుభాలు కలుగుతాయి అనేది భక్తుల అపారమైన నమ్మకం. అంతటి విశేష ప్రాముఖ్యత ఈ క్షేత్రానికి ఉంది. ప్రతి నెల అమావాస్య రోజున 60 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారు. అయినా ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు అధికారులు, పాలకులు కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా అమావాస్య రోజున భక్తులు వస్తున్నప్పటికీ వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వసతుల కల్పనలో అలసత్వం ఎందుకు..?
దిశ,నార్కట్ పల్లి: చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి నెలా అమావాస్య రోజున ఈ క్షేత్రానికి 60 వేల నుంచి లక్ష వరకు భక్తులు వస్తుంటారు. గట్టు పైన ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు ఘాట్ రోడ్, మెట్ల మార్గం ద్వారా భక్తులు వెళుతుంటారు. భక్తులకు ఎక్కడ కనీస మంచినీటి వసతిని కల్పించడం లేదు, వేల సంఖ్యలో భక్తులు స్వామివారి సన్నిధిలో ప్రతి నెల నిద్రిస్తున్నప్పటికీ వసతి గదులు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం అని చెప్పవచ్చు. కనీసం డార్మెంటరీ హాల్ అయిన నిర్మిస్తే భక్తులు నిద్రించడానికి వీలుగా ఉంటుంది. అయినా ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో వర్షాకాలంలో భక్తులు నిద్రించేందుకు తిప్పలు తప్పడం లేదు. చిన్నపాటి వర్షానికే భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోనేటిలో స్నాన ఆచరించిన మహిళా భక్తులకు దుస్తులు మార్చుకోవడానికి గదులు లేవు. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుంది. మూడు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు పడుతున్న ఇబ్బందులు ఆ స్వామికే తెలియాలి. కనీసం మరుగుదొడ్ల వసతిని కల్పించడంలో కూడా అధికారులు విఫలమయ్యారు. మూడు గుండ్ల పైన స్వామివారిని దర్శించుకునే సమయంలో ఎక్కడ టాయిలెట్లు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులు చెప్పకనే చెప్పవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా అలసత్వం ఎందుకు వహిస్తున్నారో తెలియ రావడం లేదు.
10 ఏండ్లుగా అభివృద్ధి జాడే లేదు..?
ఈ క్షేత్రానికి ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతున్న 10 ఏండ్లుగా అభివృద్ధి జాడే కనిపించడం లేదు. పాలకులు, అధికారులు అదిగో ఇదిగో అని చెబుతున్నారే తప్ప అభివృద్ధిలో మాత్రం కనీసం దృష్టి సారించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత మూడు నెలల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ వచ్చే 30 సంవత్సరాల వరకు భక్తులకు ఇబ్బందులు జరగకుండా అభివృద్ధి ప్రణాళికలు చేయాలని అధికారులకు తెలిపారు. దీంతో భక్తులంతా ఎంతో సంతోషించారు. కానీ నెలలు గడుస్తున్న అభివృద్ధి పై నీలినీడలు కమ్ముకున్నాయనే చెప్పవచ్చు. కనీసం వచ్చే అమావాస్య నాటికైనా భక్తులకు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు.






