ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా

by Kema Shiva Kumar |

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని యూఎస్ మిలిటరీ ఎత్తివేసింది.

ప్రపంచ దేశాలకు గుడ్ న్యూస్.. ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య రాజీ కుదిరిన నేపథ్యంలో మరో చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) అమెరికా సైన్యం పూర్తిగా ఎత్తివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణానికి తెరదించుతూ, ఇరుదేశాల మధ్య కుదిరిన ప్రాథమిక అవగాహన ఒప్పందం తర్వాత అమెరికా ఈ కీలక ముందడుగు వేసింది. అయితే, దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ.. కుదిరిన శాంతి ఒప్పంద నిబంధనలను ఇరుపక్షాలు పక్కాగా పాటిస్తున్నాయా.. అని పర్యవేక్షించడానికి అమెరికాకు చెందిన భారీ యుద్ధ నౌకలు అదే ప్రాంతంలో మోహరించి ఉంటాయని సైన్యం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకోవడం, ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు తొలగడం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కు పెద్ద ఊరటనిచ్చింది.

Next Story