QS వరల్డ్ ర్యాంకింగ్ లో HCU ఘనత

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

QS వరల్డ్ ర్యాంకింగ్ లో HCU ఘనత
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. విద్యా రంగంలో విశేష గుర్తింపు పొందిన అంతర్జాతీయ ఉన్నతవిద్య నెట్‌వర్క్‌ సంస్థ 'క్వాక్వరెల్లీ సైమండ్స్‌' (QS) తాజాగా విడుదల చేసిన 'క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌-2027'లో హెచ్‌సీయూ 851-900 పాయింట్ల విభాగంలో స్థానం సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో బోధనా పద్ధతులు, పరిశోధనలపై సర్వే నిర్వహించి, ఈ ర్యాంకులను గురువారం నాడు QS అధికారికంగా ప్రకటించింది. ఈ అంతర్జాతీయ సర్వేలో హెచ్‌సీయూ తన ఉత్తమ విద్యా ప్రమాణాలు, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్స్ బోధనా పనితీరులో మంచి ప్రతిభ కనబరిచి టాప్ లో నిలిచింది. అలాగే వర్శిటీ ప్రొఫెసర్స్ బృందంలో అత్యధికంగా 98.1 శాతం మంది పీహెచ్‌డీ (PhD) అర్హత కలిగి ఉన్నారని క్యూఎస్‌ సంస్థ ప్రత్యేకంగా వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500 ప్రముఖ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ కోర్సులను, వందకు పైగా విద్యాసంబంధమైన ముఖ్యాంశాలను పరిశీలించిన తర్వాతే ఈ ర్యాంకులను ఖరారు చేశారు. కాగా ఈ అంతర్జాతీయ గుర్తింపుపై హెచ్‌సీయూ ఇన్‌ఛార్జి వీసీ ప్రొఫెసర్‌ జె.అనురాధ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం సాధించిన ఈ అరుదైన ఘనత తమకెంతో సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో విద్యా ప్రమాణాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేలా తమ బాధ్యతను మరింత పెంచిందని ఆమె పేర్కొన్నారు.

Next Story