తమిళనాడులో విజయ్ సునామీ.. తెలుగు రాజకీయాల్లో 'ఫ్రెండ్షిప్' పాలిటిక్స్!

by Prasad Jukanti |   (  Updated:2026-05-04 08:55:01  IST  )

తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఏపీ, తెలంగాణ పార్టీలు సోషల్ మీడియాలో స్నేహ గీతాలు వినిపించడం ఆసక్తిగా మారింది.

తమిళనాడులో విజయ్ సునామీ.. తెలుగు రాజకీయాల్లో ఫ్రెండ్షిప్ పాలిటిక్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'సక్సెస్‌కు చాలా మంది తండ్రులు ఉంటారు.. కానీ ఓటమి మాత్రం అనాథ' అనే సామెత ఇప్పుడు దక్షిణాది రాజకీయాల్లో అక్షరాలా నిజమవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'దళపతి' విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సృష్టించిన సునామీ.. ద్రావిడ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అయితే తమిళనాడులో మొదలైన ఈ గెలుపు ప్రభంజనం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయంతో తాము కూడా భాగస్వాములం అన్నట్లుగా ఇక్కడ పార్టీలు సోషల్ మీడియా వేదికగా స్నేహ గీతాలు ఆలపిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‍గా మారింది.

ఫ్రెండ్షిప్ పాలిటిక్స్:

సినిమా గ్లామర్‌ను పక్కన పెట్టి ప్రజా క్షేత్రంలోకి వచ్చిన విజయ్.. వచ్చి రావడంతోనే ద్రవిడ రాజకీయాల్లో కాకలుతీరిన పార్టీల కంచుకోటలను బద్ధలు కొట్టారు. తమిళ ఓటర్లతో విజయ్ వేయించిన 'విజిల్' ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో మార్మోగుతోంది. రాజకీయాల్లో కొత్తగా వచ్చి సంచలనం సృష్టించిన విజయ్‌తో తమ అధినేతలకు ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకునేందుకు ప్రధాన పార్టీల మద్ధతుదారులు పోటీ పడుతున్నారు. ఇవాళ ఉదయం ట్రెండ్స్ ప్రారంభం కావడమే ఆలస్యం తెలంగాణలో బీఆర్ఎస్ (BRS), ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) శ్రేణులు సోషల్ మీడియాను విజయ్ వీడియోలతో నింపేశాయి. గతంలో విజయ్ హైదరాబాద్ వచ్చినప్పుడు మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వీడియోలను బీఆర్ఎస్ కార్యకర్తలు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గతంలో ఓ వివాహ వేడుకల్లో జగన్, విజయ్ కలిసిన వీడియోలను వైసీపీ షేర్ చేస్తోంది. ప్రస్తుతానికి బీఆర్ఎస్, వైసీపీలు విజయ్‍ను మిత్రుడిగా క్లెయిమ్ చేసుకుంటుంటే భవిష్యత్ లో విజయ్ ఎవరి పక్షాన ఉండబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

సీఎం పీఠంపై తలపతి విజయ్.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో టీవీకే

Next Story