- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం
నల్లగొండ జిల్లా రామన్నగూడెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు దుర్మరణం పాలైన హృదయవిదారక ఘటన నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల పరిధిలోని రామన్నగూడెం (Ramannaguda) స్టేజీ సమీపంలో ఇవాళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న రెండు కార్లు నియంత్రణ కోల్పోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు స్పాట్‌కు చేరుకుని క్షతగాత్రులను 108లో సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతులను సాయికుమార్, థాంసయ్య, ప్రకాశ్‌రావుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






