ఈ వయసులో ఇలాంటి పనులేంటి అంటూ రాఘవేంద్రరావు తీరుపై నెటిజన్లు ఫైర్..

by Mallepaka Hamsa |

సీన్ ఎలా చేయాలో వివరించే క్రమంలో ఆయన మొదట కీర్తి సురేష్ చేతిని పట్టుకుని బలవంతంగా లాగుతుండగా.. ఆమె దూరంగా వెళ్లింది.

ఈ వయసులో ఇలాంటి పనులేంటి అంటూ రాఘవేంద్రరావు తీరుపై నెటిజన్లు ఫైర్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాఘవేంద్ర రావు గత కొద్ది కాలంగా ట్రోల్స్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పలు సినిమా ఈవెంట్లలో పాల్గొంటున్న ఆయన హీరోయిన్లతో ప్రవర్తించే తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఇటీవల ఆయన ఓ ఈవెంట్‌లో భాగంగా..మెగా డాటర్ నిహారిక కొణిదెల విషయంలో కూడా ఆయన ఇలాగే ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇప్పుడు మరోసారి ఓ ఇద్దరు హీరోయిన్లతో ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సరికొత్త చిత్రం హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముహూర్తపు షాట్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. సీనియర్ దర్శకుడు, 84 ఏళ్ల కే. రాఘవేంద్రరావు తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు.

అయితే, ముహూర్తపు షాట్ డైరెక్ట్ చేస్తున్న సమయంలో రాఘవేంద్రరావు గారు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టిల చేతులు పట్టుకుని తన వైపుకు లాగడం నెటిజన్లకు కోపం తెప్పిస్తోంది. సీన్ ఎలా చేయాలో వివరించే క్రమంలో ఆయన మొదట కీర్తి సురేష్ చేతిని పట్టుకుని బలవంతంగా లాగుతుండగా.. ఆమె దూరంగా వెళ్లింది. ఆ తర్వాత కృతి శెట్టిని కూడా అలాగే ముందుకు లాగి దన దగ్గరకు తీసుకుని సీన్ వివరించారు. అనంతరం హీరోలు వెంకటేష్, కళ్యాణ్ రామ్ చేతులను హీరోయిన్ల భుజాలపై ఎలా ఉంచాలో ఆయన చూపిస్తూ కనిపించారు. ఇక ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వయసులో కూడా ఆయనకు హీరోయిన్లను అలా ముట్టుకోవాల్సిన అవసరం ఏముంది? తాకకుండా కూడా సీన్ వివరించవచ్చు కదా.. వాళ్లకు ఇష్టం లేకుండా అలా పట్టుకోవడం ఏంటనీ ఫైర్ అవుతున్నారు. అంతటితో ఊరుకోకుండా ఆయనపై ట్రోలింగ్ మొదలెట్టారు.

Next Story