కరీంనగర్‌లో అర్దరాత్రి ఎలుగుబంటి కలకలం

by Ajay Maddhiboyina |

కరీంనగర్ జిల్లా గట్టుబూత్కార్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబండి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. గణేష్ నగర్ ప్రాంతంలో ఎలుగుబండిని చూసిన స్థానికులు భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలకు అక్కడ నుండి పారిపోయింది.

కరీంనగర్‌లో అర్దరాత్రి ఎలుగుబంటి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: కరీంనగర్ జిల్లా గట్టుబూత్కార్ గ్రామంలో అర్ధరాత్రి ఎలుగుబండి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. గణేష్ నగర్ ప్రాంతంలో ఎలుగుబండిని చూసిన స్థానికులు భయంతో కేకలు వేశారు. ఆ శబ్దాలకు అక్కడ నుండి పారిపోయింది. అయితే గ్రామంలోకి ఎలుగుబంట్లు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ గ్రామంలో ఎలుగుబంట్లు సంచరించాయి. గ్రానైట్ క్వారీల వల్ల ఎలుగు బంట్లు ఆవాసాలను కోల్పోవడంతో తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఎలుగుబండి అక్కడే ఉన్న ఓ కుక్కపై దాడికి యత్నించినట్టు కూడా కనిపిస్తుంది. వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ స్థానికులు అధికారులను ట్యాగ్ చేస్తూ ఎలుగు బంటి గ్రామంలోకి రాకుండా చూడాలని పోస్టులు పెడుతున్నారు.

Next Story