- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahalgam terror attack: పహల్గామ్ అమరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళి
పెహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధితులకు నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే శక్తులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

X
దిశ, వెబ్ డెస్క్: సరిగ్గా ఏడాది క్రితం పహల్గామ్‌లో జరిగిన కిరాతక ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. మన ప్రజలను కోల్పోయిన ఆ వేదన ప్రతి భారతీయుడి గుండెల్లో నేటికీ సజీవంగానే ఉందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికే అతిపెద్ద శత్రువని, దానిని ఓడించేందుకు మనమంతా ఐక్యంగా పోరాడాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న 'జీరో టోలరెన్స్' (సహించే ప్రసక్తే లేదు) విధానాన్ని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులతో పాటు వారికి ఆశ్రయం కల్పించే శక్తులను ఏరిపారేసే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బాధితుల కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
ఉగ్రవాదానికి తలవంచే ప్రసక్తే లేదు.. ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం.. ప్రధానిని 'ఉగ్రవాది' అనడం పై ఈసీకి ఫిర్యాదు
Next Story






