- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం.. ప్రధానిని 'ఉగ్రవాది' అనడం పై ఈసీకి ఫిర్యాదు
ప్రధాని మోదీని 'ఉగ్రవాది' అని ఖర్గే పిలవడంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని పేర్కొంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోని చివరి రోజు సంచలనంగా మారింది. చెన్నైలో జరిగిన విలేకరుల సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోదీని 'ఉగ్రవాది' అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం కలకలంగా మారింది. ఏఐఏడీఎంకే (AIADMK) వంటి పార్టీలు సమానత్వం, న్యాయాన్ని నమ్మని మోడీ వంటి వ్యక్తితో ఎలా జతకడతాయని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఖర్గే చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఇది కేవలం వ్యక్తిగత అవమానం మాత్రమే కాదని, దేశ ప్రజాస్వామ్య సంస్థలపై జరిగిన దాడి అని అభివర్ణించారు. ఖర్గే వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (MCC) స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొంటూ బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసింది. ఖర్గేపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆయన ప్రచారంపై నిషేధం విధించాలని, తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు.
మోడీ ఉగ్రవాది వ్యాఖ్యలపై ఖర్గే వివరణ
ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలతో వివాదం ముదరడంతో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను మోడీని 'ఉగ్రవాది' అని శాబ్దిక అర్థంలో అనలేదని, ఈడీ (ED), ఐటీ (IT), సీబీఐ (CBI) వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ఆయన ప్రత్యర్థులను 'టెర్రరైజ్' (భయభ్రాంతులకు గురిచేయడం) చేస్తున్నారనే అర్థంలో అన్నానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ మాత్రం ఈ వివరణను అంగీకరించడం లేదు.






