కోహ్లీ అభిమానుల‌కు బిగ్ రిలీఫ్‌..ఇంగ్లండ్ సిరీస్‌కు ఫిట్!

by velandi.Saikiran |

కోహ్లీ అభిమానుల‌కు బిగ్ రిలీఫ్‌..ఇంగ్లండ్ సిరీస్‌కు ఫిట్ గా ఉంటాడ‌ని స‌మాచారం.

కోహ్లీ అభిమానుల‌కు బిగ్ రిలీఫ్‌..ఇంగ్లండ్ సిరీస్‌కు ఫిట్!
X

దిశ‌, వెబ్ డెస్క్: విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్ సందర్భంగా గాయపడిన విరాట్ కోహ్లీ కోలుకున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ నాటికి, పూర్తిస్థాయిలో ఫిట్ అవుతాడని జోరుగా ప్రచారం సాగుతోంది. గాయం నుంచి విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. కాగా ఇవాళ్టి నుంచి ఆఫ్ఘనిస్తాన్, భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కు విరాట్ కోహ్లీ ఎంపికైనప్పటికీ.. గాయం కారణంగా దూరం అయ్యాడు. దీంతో కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ తో జూలై 14 వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.

Next Story