వైభవ్ కు బిగ్ షాక్‌.. అరంగేట్రంపై కొత్త టెన్ష‌న్?

by velandi.Saikiran |

వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ త‌గిలింది. అత‌ని అరంగేట్రంపై కొత్త టెన్ష‌న్ నెల‌కొంది.

వైభవ్ కు బిగ్ షాక్‌.. అరంగేట్రంపై కొత్త టెన్ష‌న్?
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఈ నెల చివరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే భారత జట్టును కూడా బీసీసీఐ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ తో వన్డే సిరీస్ పూర్తికాగానే, ఐర్లాండ్ వెళ్లనుంది భారత్. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐర్లాండ్ వర్సెస్ భారత్ మధ్య జరిగే సిరీస్ రద్దు అవుతుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఐర్లాండ్ లో అల్లర్లు జరుగుతున్నాయి. ఓ వివాదాస్పద కత్తిపోట్ల సంఘటన నేపథ్యంలో ఐర్లాండ్ లో భారీ ఎత్తున నిరసనలు, హింసాత్మక అల్లర్లు చెలరేగుతున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో టీ20 సిరీస్ రద్దు లేదా వాయిదా పడుతుందని అంటున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సిరీస్ రద్దు అవుతుందని ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకవేళ సిరీస్ రద్దు లేదా వాయిదా పడితే, మాత్రం వైభవ్ కు నిరాశ ఎదురయ్యేది ప్రమాదం ఉంది. ఐర్లాండ్ సిరీస్ తోనే వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేస్తాడని అంటున్నారు. పసికూన ఐర్లాండ్ తో మొదటగా ఆడించి.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తీసుకుపోవాలని బీసీసీఐ కూడా ప్లాన్ చేసింది. ఇంతలోనే ఐర్లాండ్ లో జరుగుతున్న నిరసనలు వైభవ్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. దీంతో వైభవ్ అరంగేట్రం కాస్త ఆలస్యంగా జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

Next Story