- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదలైన వర్షం.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం షురూ అయింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం షురూ అయింది. శుక్రవారం సాయంత్రం కాగానే, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం మొదలైంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, యాదాద్రి జిల్లాలో అర్ధరాత్రి రెండు గంటల వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 60 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీలుస్తాయని పేర్కొంది. ఇక తెలంగాణలోని మిగతా జిల్లాలకు కూడా వర్షసూచన ఉన్నట్లు పేర్కొంటూ, ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం
హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం పడుతోంది. రాత్రి 9:30 గంటలకు ఆకాశంలో మబ్బులు కమ్మి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన కోడళ్ళలో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. ఎర్రగడ్డ మైత్రివనం, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకపూల్, బేగంపేట, ప్యాట్నీ సెంటర్, జేబీఎస్, సికింద్రాబాద్ ఏరియాలలో భారీ వర్షం పడుతోంది.






