- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సేవలకు అంతరాయం
సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' సంస్థకు చెందిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి స్తంభించిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం 'మెటా'(Meta) సంస్థకు చెందిన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి స్తంభించిపోయాయి. శుక్రవారం సాయంత్రం సాంకేతిక లోపం కారణంగా ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లు గంటల తరబడి నిలిచిపోవడంతో కోట్లాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవలి కాలంలో మెటా నెట్‌వర్క్‌లో సంభవించిన అతిపెద్ద గ్లోబల్ అవుటేజ్ లలో ఇది ఒకటిగా నిలిచింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అకౌంట్లు ఉన్నపళంగా లాగౌట్ అయిపోవడం, కొత్తగా లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఎర్రర్ రావడం, హోమ్ ఫీడ్ అసలు లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. వాట్సాప్‌లో కేవలం ‘కనెక్టింగ్’ అని మాత్రమే చూపిస్తూ, పంపిన సందేశాలు వెళ్లకుండా, అవతలి వారి నుంచి రాకుండా నిలిచిపోయాయి.
వాయిస్, వీడియో కాల్స్ కూడా పనిచేయలేదు. 'డౌన్‌డిటెక్టర్' (Downdetector) వెబ్‌సైట్ ప్రకారం.. కొద్ది నిమిషాల్లోనే ఒక్క ఫేస్‌బుక్ పైనే ఏకంగా 1,20,000 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లకూ లక్షల్లో రిపోర్టులు వచ్చాయి. ఐ సమస్యతో వినియోగదారుల చాటింగ్‌లతో పాటు, మెటాకు చెందిన బిజినెస్ టూల్స్ అయిన ఆడ్స్ మేనేజర్ (Ads Manager), బిజినెస్ సూట్ (Business Suite) లు కూడా పూర్తిగా డౌన్ అయ్యాయి. దీనివల్ల డిజిటల్ మార్కెటింగ్ రంగం, ఆన్‌లైన్ వ్యాపారాలు గంటల తరబడి నిలిచిపోయి భారీగా నష్టపోయాయి.






