- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్, సంగప్పలను అరెస్ట్ చేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రాష్ట్రంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రాన్ని పోక్సో సమస్య వేధిస్తున్నదని.. ముఖ్యమంత్రి శాంతిభద్రతలను గాలికి వదిలేశారని.. పోక్సో కేసు (POCSO case)లకు రాష్ట్రం చిరునామాగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో మహమ్మద్ గౌస్ అనే దుండగుడు 12 ఏళ్ల అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని.. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తానని అనడంతో అమ్మాయిని 5వ ఫ్లోర్ నుంచి నెట్టేయగా కోమాలోకి వెళ్లి, ఇపుడు నిమ్స్‌లో చికిత్స పొందుతున్నదన్నారు. 2024 లో కాంగ్రెస్ పాలనలో 2103 మందిపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయన్నారు.
మే 8న ఒక మహిళా తన కూతురిపై పలుమార్లు అత్యాచారం జరిగిందని పేట్ బషీరాబాద్‌లో కేసు పెడితే నిందితుడు అరెస్ట్ అయ్యారని.. కానీ, ఎ2,ఎ3 ఎక్కడ అని.. ఎ3 సంగప్ప ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. ఆయనకు అన్ని విషయాలు తెలుసినా పోలీసులు ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. బండి సంజయ్‌ని కూడా విచారించాలని.. ఆయన బాధితురాలిని బెదిరించారా లేదా? అని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, హోం మంత్రి ఉన్నారా అని నిలదీశారు. సీతక్క హాస్పిటల్‌కి ఎందుకు రాలేదన్నారు. మీనాక్షి తెలంగాణ కాంగ్రెస్‌ను నమ్ముకొని వస్తే, మహిళ అని కూడా చూడకుండా మోసం చేశారని ఆరోపించారు.
- Tags
- RS Praveen Kumar






