- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐఆర్ కు సహకరించండి : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి.సుదర్శన్ రెడ్డి
ఈ నెల 25 నుండి జరగబోయే ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమం సజావుగా జరిగేవిధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ ఎన్నికల కమిషనర్ సి. సుదర్శన్ రెడ్డి కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ నెల 25 నుండి జరగబోయే ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వే కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి సర్వే కార్యక్రమం సజావుగా జరిగేవిధంగా సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలను తెలంగాణ ఎన్నికల కమిషనర్ సి. సుదర్శన్ రెడ్డి ఐఎస్ కోరారు. శుక్రవారం బీఆర్కే భవన్ లోని సీఇఓ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం అర్హులైన పౌరులను ఓటర్ల జాబితాలో చేర్చి, అనర్హులను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితాను తయారు చేసేందుకే ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనికి అన్ని రాజకీయ పార్టీల వారు రాష్ట్రంలో సజావుగా నిర్వహించేందుకు తమ సహాయసహకారాలు అందజేయాలని సీఈఓ కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈనెల 25 నుండి జులై 24 వరకు ఇంటింటి సర్వే గణన ప్రారంభం కానునందున బీఎల్ఓలు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను అందిస్తారని, వీటిని పూరించే విషయంలో రాజకీయ పార్టీలు వారి బీఎల్ఎ ద్వారా సరైన విధంగా ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సహకారాలను అందించాలని, ఇందుకు సంబంధించి బిఎల్ఎలకు తగిన అవగాహన కల్పించాలని, ఎస్ఐఆర్ పై ప్రజలకు ఎలాంటి అపోహలు, అనుమానాలు కలుగకుండా ప్రజలకు తమవంతు బాధ్యతగా ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశంపై అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే జరిగే సమయంలో ఎలాంటి శాంతిభద్రత సమస్య తెలెత్తకుండా సహకరించాలని కోరారు. మ్యాపింగ్ తో సంబంధం లేకుండా, ఎన్యూమరేషన్ ఫారమ్‌లను పూరించి సమర్పించిన ప్రతి ఓటరును 31.07.2026న ప్రచురించబడే ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని తెలిపారు.
ఏఈఆర్ఓలకు శిక్షణ…
హైదరాబాద్ జిల్లా ఎన్నికల సిబ్బంది కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై హైదరాబాద్ జిల్లాలోని అసిస్టెంట్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్(ఏఈఆర్ఓ)లకు శుక్రవారం సమగ్ర శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ విభాగం రాష్ట్ర స్థాయి నోడల్ అధికారి బి. చెన్నయ్య, తెలంగాణ సీఈఓ కార్యాలయ డిప్యూటీ కలెక్టర్ ఎం. జయచంద్ర రెడ్డి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఎన్నికలు) కె. చంద్రకళ శిక్షణ అందించారు. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లు, ఎన్నికల క్లర్కులు, ఎన్నికల ఆపరేటర్లు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ విధానాలు, ధృవీకరణ ప్రక్రియలు, ఓటర్ల డేటా నిర్వహణ, అవసరమైన పత్రాలు మరియు పారదర్శకమైన, లోపం లేని సవరణ ప్రక్రియను నిర్వహించడంలో ఎన్నికల అధికారుల పాత్రలు, బాధ్యతలు వంటి అంశాలను వివరించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఒకేరకమైన విధానాన్ని అమలు చేయడానికి రూపొందించిన మార్గదర్శకాలపై స్పష్టతనిచ్చారు. శిక్షణ పొందిన అధికారులు 15.06.2026 నుండి 24.06.2026 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ), బీఎల్ఓ సూపర్‌వైజర్ల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.






