Peddi: రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ నిర్ణ‌యం, టెన్ష‌న్ ద‌ర్శ‌కుడు!

by velandi.Saikiran |

పెద్ది సినిమా హిట్ అయిన నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

Peddi: రామ్ చ‌ర‌ణ్ షాకింగ్ నిర్ణ‌యం, టెన్ష‌న్ ద‌ర్శ‌కుడు!
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేయగా.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా జనాలకు బాగా క్లిక్ అయింది. ఈ క్రమంలో కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. పెద్దికి పోటీగా పెద్ద హీరోల సినిమాలు రాకపోవడంతో... రామ్ చరణ్ కు బాగా కలిసి వచ్చింది. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.

అయితే పెద్ది సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో రామ్ చరణ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. దాదాపు నాలుగు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. పెద్ది సినిమా షూటింగ్ సమయంలో చరణ్ కు చాలా గాయాలు అయినట్లు టాక్. అయితే వాటన్నిటి నుంచి రికవరీ అయ్యేందుకు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. దాదాపు నాలుగు నెలల సమయం తీసుకొని, ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో సుకుమార్ సినిమా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నారు.

Next Story