- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIతో ఉద్యోగాలు పోవు.. ఎవరూ టెన్షన్ పడొద్దు : జెఫ్ బెజోస్
by velandi.Saikiran |
AIతో ఉద్యోగాలు పోవు.. ఎవరూ టెన్షన్ పడొద్దు అంటూ జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: AI వచ్చిన తర్వాత చాలా కంపెనీలలో ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి నేపథ్యంలో AIపై అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. AI వల్ల భారీగా ఉద్యోగాలు పోతాయనే అంచనాలను ఆయన కొట్టి పారేశారు. ఉద్యోగాలు పోతాయని ఓ నిర్ధారణకు వస్తున్న వాళ్ళు తప్పుగా ఆలోచన చేస్తున్నారని కామెంట్ చేశారు.
AI ప్రోడక్టివిటీని పెంచుతోందని.. కొత్త పరిశ్రమలకు దారి చూపుతోందని వెల్లడించారు. ప్రజలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తోందని ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు జెఫ్ బెజోస్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా ప్రోమోథియస్ పేరుతో ఏఐ వెంచర్ ను విక్ బజాజ్ తో కలిసి ఇటీవల తీసుకువచ్చారు జెఫ్ బెజోస్.
- Tags
- Jeff Bezos
- AI
Next Story






