నివాస ప్రాంతాల్లో హాస్టళ్లు

by velandi.Saikiran |   (  Updated:2026-07-17 23:01:09  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విద్య, ఉ ద్యోగాల కోసం నగరానికి వచ్చే యువ తకు వసతి కల్పించడం అవసరమే అయినప్పటికీ, అదే పేరుతో అనేక నివాస గృహాలు ప్రైవేట్ హాస్టళ్లుగా మారాయి.

నివాస ప్రాంతాల్లో హాస్టళ్లు
X

దిశ, హస్తినాపురం: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విద్య, ఉ ద్యోగాల కోసం నగరానికి వచ్చే యువ తకు వసతి కల్పించడం అవసరమే అయినప్పటికీ, అదే పేరుతో అనేక నివాస గృహాలు ప్రైవేట్ హాస్టళ్లుగా మారాయి. దీంతో స్థానిక కాలనీల స్వ రూపం మారిపోతోందని ప్రజలు ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టికేర్ కాలేజ్, హనుమాన్ నగర్, అగ్రికల్చర్ కాలనీ, జెడ్పి రోడ్డు, కేశవాపురి కాలనీ, చైతన్య నగర్, షిరిడి సాయి నగర్, చైతన్యపురి, ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో ప్రతి వీధిలోనూ బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లు కనిపిస్తున్నాయి. దీంతో నివాస ప్రాంతాలు క్రమంగా కమర్షియల్ జోన్‌లుగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాలనీల్లో ప్రశాంతత తగ్గిపోవడంతో పాటు ట్రా ఫిక్, పార్కింగ్, పారిశుధ్యం, భద్రత వంటి సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

పార్కింగ్‌తో ఇబ్బందులు..

ఒకే హాస్టల్ వద్ద పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు నిలిపివేయడంతో గల్లీలు ఇరుకుగా మారుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాహనాల ను ఇష్టానుసారంగా రోడ్లపై పార్క్ చే యడంతో పాదచారులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొంటున్నారు. అత్యవసర సమయంలో అంబులెన్స్ లేదా అగ్నిమాపక వాహనాలు లోపలికి రా వడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పర్మిషన్లు ఉన్నాయా?

ఒక కుటుంబం నివసించేందుకు ని ర్మించిన భవనాల్లో ఇప్పుడు డజన్ల సం ఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నివసిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రైవేట్ హాస్టల్ నిర్వహణకు పట్టణ స్థానిక సంస్థల అనుమతులు, అగ్నిమాపక శాఖ భద్రతా ధ్రువీకరణ, భవన వినియోగ అనుమతి, పారిశుద్ధ్య ప్రమాణాలు, విద్యుత్, నీటి వినియోగానికి సంబంధించిన నిబంధనలు అ మలులో ఉండాలి. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని హాస్టళ్లు ఈ ప్రమాణాలను పాటిస్తున్నాయా అనే అం శంపై సమగ్ర పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు.

Next Story