ఇంగ్లాండ్ బంప‌ర్ ఆఫ‌ర్‌...రిజెక్ట్ చేసిన‌ RCB హెడ్ కోచ్

by velandi.Saikiran |   (  Updated:2026-07-18 01:18:15  IST  )

RCB హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో బెంగళూరును వదిలి ఇంగ్లాండ్ వెళ్తాడని కూడా జోరుగా ప్రచారం సాగింది.

ఇంగ్లాండ్ బంప‌ర్ ఆఫ‌ర్‌...రిజెక్ట్ చేసిన‌ RCB హెడ్ కోచ్
X

దిశ‌, వెబ్ డెస్క్: టెస్టులకు కొత్త కోచ్ ను నియామకం చేసే పనిలో పడింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. ఇందులో భాగంగానే చాలా మంది పేర్లను పరిశీలన చేస్తోంది. ఇప్పటికే రాహుల్ ద్రావిడ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్లను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంప్రదించింది. తాజాగా RCB హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో బెంగళూరును వదిలి ఇంగ్లాండ్ వెళ్తాడని కూడా జోరుగా ప్రచారం సాగింది.

అయితే దీనిపై తాజాగా RCB హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ క్లారిటీ ఇచ్చారు. ఇంగ్లాండ్ టెస్ట్ టీం కోచ్ గా మళ్లీ బాధ్యతలు చేపట్టే ఆసక్తి తనకు లేదని వెల్లడించారు. ప్రస్తుతం చేస్తున్న పనితో తాను సంతృప్తిగా ఉన్నానని.. అతిగా ఆశపడబోనని వివరించారు. గతంలో ఇంగ్లాండుకు పని చేసినప్పటికీ... ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇది ఇలా ఉండగా 2009 నుంచి 2014 వరకు ఇంగ్లాండ్ కోచ్ గా ఆండీ ఫ్లవర్ పనిచేశారు. ఆ తర్వాత కాస్త రెస్ట్ తీసుకున్న ఆయన... 2024 నుంచి బెంగళూరు హెడ్ కోచ్ పదవి చేపట్టారు. ఈయన వచ్చిన తర్వాతే బెంగళూరు టైటిల్స్ కొట్టడం మొదలుపెట్టింది.

Next Story