అల్ప‌పీడ‌నం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు

by velandi.Saikiran |   (  Updated:2026-07-18 01:15:59  IST  )

అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

అల్ప‌పీడ‌నం ఎఫెక్ట్..ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు
X

దిశ‌, వెబ్ డెస్క్: అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని మంచిర్యాల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి, వరంగల్, ములుగు, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, జనగాం, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు హైదరాబాద్ మహా నగరంలో కూడా ఇవాళ చిరు జల్లులు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. మిగతా జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించింది.

అటు ఏపీలో కూడా వర్షాలు ఉన్నాయి. శనివారం విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు, మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు APSDMA ఎండీ ప్రఖర్ జైన్. కోస్తాంధ్రలో గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Next Story