సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి.. అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణ!

by Malleboina Mahesh |

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షలో ఉన్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి జరిగిందంటూ అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు!

సోనమ్ వాంగ్‌చుక్‌పై దాడి.. అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణ!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద లడఖ్ పరిరక్షణ, ప్రత్యేక హోదా కోరుతూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ (Sonam Wangchuk) గత 21 రోజులుగా దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో అయితే శనివారం తెల్లవారుజామున ఆయన దీక్షను భగ్నం చేసిన పోలీసులు, ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు సోనమ్ వాంగ్ చుక్ పై దాడి జరిగిందని 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

జంతర్ మంతర్ వేదికగా శాంతియుతంగా దీక్ష కొనసాగిస్తోన్న వాంగ్‌చుక్ లక్ష్యంగా కొందరు అపరిచిత వ్యక్తులు ఈ దాడికి ఒడిగట్టారని, శాంతియుత నిరసనలను అణచివేసేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని అభిజీత్ దిప్కే మండిపడ్డారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తక్షణమే స్పందించి, దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సోనమ్ వాంగ్‌చుక్‌కు తగిన భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Next Story