- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్.. ఆమరణ దీక్ష చేస్తానని ఆర్ఎస్పీ హెచ్చరిక
బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు ముందు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశాారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించేందుకు మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యు సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతోంది. ఈ సదస్సుకు అధికారులు అనుమతులు నిరాకరించడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకుంది. అయితే ఈ సదస్సుకు ముందు ఇవాళ పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓ వీడియో రిలీజ్ చేశారు.
ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తోంది:
ఇవాళ ఉదయమే నన్ను అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వచ్చారని మాకు సరూర్ నగర్ లో మా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తున్న యువ సంగ్రామ సదస్సు ఉందని చెప్పినా మాకు పైనుండి ఆదేశాలు ఉన్నాయని, మిమ్ములను ఎక్కడ పోనివ్వకూడదని పోలీసులు అంటున్నారని ఆర్ఎస్పీ చెప్పుకొచ్చారు. మల్కాజిగిరి పోలీసులు సభకు అనుమతి ఉందని, హైకోర్టు అనుమతి ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా కాలరాస్తున్నారని ఆర్ఎస్పీ మండిపడ్డారు. ఈ నిర్బంధం ఇందిరమ్మ ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది. మళ్లీ సిగ్గు లేకుండా ప్రజా పాలన అంటున్నారని దుయ్యబట్టారు. హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మొదటి నుంచీ మా సభలకు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నారని మీరెన్ని అడ్డంకులు సృష్టించినా కుట్రలు చేసినా నేను మా సభకు వెళ్తానని ఒకవేళ పోనివ్వకుండా అడ్డుకుంటే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.






