డాక్యుమెంటేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం

by Jakkula.Mamatha |

ప్రమాదవశాత్తు పట్టణంలోని సరిత డాక్యుమెంటేషన్ కార్యాలయంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

డాక్యుమెంటేషన్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
X

దిశ, షాద్ నగర్: ప్రమాదవశాత్తు పట్టణంలోని సరిత డాక్యుమెంటేషన్ కార్యాలయంలో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో సరిత డాక్యుమెంటేషన్ లో షార్ట్‌సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు, ఫర్నిచర్‌తో పాటు ఇతర విలువైన సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న షాపు యజమాని మహేష్ చంద్ర ఘటనాస్థలికి చేరుకునేలోపే కార్యాలయం మొత్తం అగ్నికి ఆహుతైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను నష్టం వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story