- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కట్టంగూర్ మండలంలో తీవ్ర విషాదం.. నిన్న యువతి అనుమానాస్పద మృతి.. నేడు యువకుడి ఆత్మహత్య!
నల్లగొండ జిల్లా మునుకుంటలలో కలకలం.. నిన్న యువతి అనుమానాస్పద మృతి, నేడు యువకుడు చరణ్ ఆత్మహత్య.. ప్రేమ కోణంలో కట్టంగూర్ పోలీసుల దర్యాప్తు!

దిశ, వెబ్ డెస్క్: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం లో విషాద సంఘటన చోటు చేసుకుంది. నిన్న ఒకే గ్రామంలో నిన్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఈ రోజు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం గా మారింది. కట్టంగూర్ మండల పరిధిలోని మునుకుంటల గ్రామంలో 24 గంటల వ్యవధిలో జరిగిన రెండు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకే గ్రామానికి చెందిన ఒక యువతి నిన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆ మరుసటి రోజైన ఈరోజు ఉదయం అదే గ్రామానికి చెందిన చరణ్ అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకరి తర్వాత ఒకరు ఇలా వరుసగా ప్రాణాలు కోల్పోవడంతో మునుకుంట్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనడంతో పాటు స్థానికంగా పలు అనుమానాలు, తీవ్ర ఉత్కంఠ వ్యక్తమవుతున్నాయి.
ఈ రెండు ఘటనలపై సమాచారం అందుకున్న కట్టంగూర్ పోలీసులు తక్షణమే గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతి చెందిన యువతికి, ఈరోజు ఆత్మహత్య చేసుకున్న చరణ్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? వీరి వరుస మరణాల వెనుక ఏదైనా ప్రేమ వ్యవహారం ఉందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.






