చివరి నిమిషంలో నిలిచిన విక్రమ్‌ - 1 ప్రయోగం

by Prasad Jukanti |   (  Updated:2026-07-18 06:24:19  IST  )

స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన ‘విక్రమ్‌-1’ రాకెట్ ప్రయోగం సాంకేతిక లోపం వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది.

చివరి నిమిషంలో నిలిచిన విక్రమ్‌ - 1 ప్రయోగం
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర సృషించబోతున్న విక్రమ్ -1 రాకెట్ ప్రయోగంలో చివరి నిమిషంలో నిలిచిపోయింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో ఈ ప్రయోగం ఆగిపోయింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన దేశీయ తొలి ప్రైవేటు ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 11:30 గటలకు శ్రిహరి కోట నుంచి నింగిలోకి దుసుకెళ్లాల్సి ఉంది. అయితే కౌంట్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో లాంచ్ కు ఐదు నిమిషాల ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రస్తుతానికి ప్రయోగం వాయిదా వేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితిని సరిదిద్దేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అన్ని సజావుగా జరిగతే ఇవాళ మధ్యాహ్నం 12:05 గంటలకు ఈ రాకెట్‍ను ప్రయోగించనున్నట్లు సమాచారం.

Next Story