నల్గొండ చౌరస్తాలో గులాబీ సందడి.. ‘యువ సంగ్రామ సభ’కు భారీ ర్యాలీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు

by Jakkula.Mamatha |

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న సరూర్‌నగర్ “యువ సంగ్రామ సభ”కు హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం నల్గొండ చౌరస్తా వద్ద భారీగా సమీకరయ్యారు.

నల్గొండ చౌరస్తాలో గులాబీ సందడి..  ‘యువ సంగ్రామ సభ’కు భారీ ర్యాలీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
X

దిశ,చంపాపేట్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న సరూర్‌నగర్ “యువ సంగ్రామ సభ”కు హాజరయ్యేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం నల్గొండ చౌరస్తా వద్ద భారీగా సమీకరయ్యారు. గులాబీ కండువాలు ధరించి, పార్టీ జెండాలు చేతబట్టి నినాదాలు చేస్తూ ఉత్సాహభరిత వాతావరణంలో ర్యాలీగా సరూర్‌నగర్ స్టేడియం వైపు పయనమయ్యారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి యువత, కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా పార్టీ పిలుపునిచ్చింది.

ఈ సందర్భంగా నల్గొండ చౌరస్తా పరిసర ప్రాంతమంతా గులాబీ రంగులో ముస్తాబై సందడిగా మారింది. మహిళా నాయకులు, యువ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై తెలంగాణ”, “జై బీఆర్ఎస్” నినాదాలతో హోరెత్తించారు. కేటీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. సరూర్‌నగర్‌లో నిర్వహిస్తున్న “యువ సంగ్రామ సభ” ద్వారా రాష్ట్రంలోని యువత సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలు, ప్రజా సమస్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తుండటంతో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు, భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

Next Story