ఖిల్లా, చర్చ్‌ను సందర్శించిన హీరో మంచు విష్ణు

by Jakkula.Mamatha |

ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు మెదక్‌ పట్టణంలోని చారిత్రాత్మక మెదక్ ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్‌ను సందర్శించారు.

ఖిల్లా, చర్చ్‌ను సందర్శించిన హీరో మంచు విష్ణు
X

దిశ, మెదక్‌టౌన్: ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు మెదక్‌ పట్టణంలోని చారిత్రాత్మక మెదక్ ఖిల్లాను, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్‌ను సందర్శించారు. ఖిల్లాలోని చారిత్రక నిర్మాణాలను పరిశీలిస్తూ వాటి విశిష్టతను, చర్చ్ గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. చారిత్రక ప్రాధాన్యత కలిగిన మెదక్ ఖిల్లా ను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అలాగే తాను నిర్మించబోయే తదుపరి సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మెదక్ ఖిల్లాలో చిత్రీకరించే ఆలోచన ఉందని తెలిపారు. మెదక్ ఖిల్లా సహజ సిద్ధమైన అందాలు, చారిత్రక వైభవం సినిమా చిత్రీకరణ కు ఎంతో అనుకూలంగా ఉన్నాయని ఆయన అన్నారు. చర్చ్ ను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంచు విష్ణు ఖిల్లా సందర్శన సందర్భంగా అభిమానులు, స్థానికులు ఆయన ను కలిసి ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, టూరిజం జిల్లా అధికారి రమేష్, మున్సిపల్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్స్ గంట సంపత్, అఖిల్, హరిత, అరుణ, కో ఆప్షన్ తాహెర్, నాయకులు బొజ్జ పవన్, రాగి అశోక్, భూపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Next Story