శభాష్ తోబుట్టువులు.. ఒకే ఇంట్లో ముగ్గురు NEET విజేతలు

by Naga Rani Yarlagadda |

నీట్ రీ-ఎగ్జామినేషన్ లో దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి.. వైద్యులవ్వాలన్న తమ కలల వైపు మొదటి అడుగు వేశారు.

శభాష్ తోబుట్టువులు.. ఒకే ఇంట్లో ముగ్గురు NEET విజేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ రీ-ఎగ్జామినేషన్ లో దేశవ్యాప్తంగా అనేకమంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి.. వైద్యులవ్వాలన్న తమ కలల వైపు మొదటి అడుగు వేశారు. అయితే.. ఓ కుటుంబంలో ముగ్గురు తోబుట్టువులు ఒకేసారి నీట్ ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఆ మధ్యతరగతి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉంటే ఎంత కష్టమైనా, లక్ష్యాన్నైనా సాధించవచ్చనని వారు నిరూపించారు. బిహార్ లోని సాహర్సా జిల్లా తులసియాహి కి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తోబుట్టువులు నీట్ 2026 రాతపరీక్షలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న రోహిత్ కుమార్ - పూనమ్ దేవిలకు రజనీష్ కుమార్ (21), కుమార్తె సాక్షి కుమారి (20) మరో కుమారుడు ప్రహ్లాద్ కుమార్ (18) ఉన్నారు. వీరు ముగ్గురు నీట్ లో వరుసగా ఆలిండియా స్థాయిలో 3,122,- 9,672, -26,751 వ ర్యాంకులు సాధించారు. ముగ్గురు పిల్లలు వైద్యులు కానుండటంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు.

తమ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్ని కళ్లారా చూసిన ఈ పిల్లలు.. చదువే తమను తీర్చిదిద్దుతుందని నమ్మారు. సాహర్సాలోని ప్రగతి క్లాసెస్ లో 11, 12 తరగతుల విద్యను పూర్తిచేసి తర్వాత.. టౌన్ లో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని ముగ్గురూ కలిసి ప్రిపరేషన్ మొదలు పెట్టారు. రోజుకు 10-13 గంటలపాటు కష్టపడి చదివారు. పాత పరీక్షా పేపర్లన్నింటినీ సాధన చేస్తూ.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో పాటు.. ఇతర విషయాలకు అట్రాక్ట్ అవకుండా చదివారు. కృషితో సాధ్యంకానిదేదీ లేదని నిరూపించారు. రజనీష్, సాక్షిలు తమ మూడవ ప్రయత్నంలో నీట్ లో ర్యాంక్ సాధించగా.. ప్రహ్లాద్ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విజయం తమ తల్లిదండ్రుల త్యాగాలకు, గురువుల మార్గదర్శకత్వానికి దక్కిన ప్రతిఫలమని ఆ ముగ్గురు వైద్య విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Next Story