డిసెంబర్ నాటికి అందుబాటులోకి 100 పడకల ఏరియా ఆసుపత్రి

by Ratna Kumari |

ఇల్లెందులో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య.

డిసెంబర్ నాటికి అందుబాటులోకి 100 పడకల ఏరియా ఆసుపత్రి
X

దిశ, ఇల్లెందు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని జీకే కాలనీలో నిర్మాణంలో ఉన్న 100 పడకల నూతన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భవనాన్ని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా టీజీఎంఐడీసీ అధికారులు ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారం వేగంగా కొనసాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించేలా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబుతో కలిసి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణంలో నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బోళ్ల సూర్యం, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు మడుగు సామమూర్తి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాలిపల్లి స్వరూప, కాంగ్రెస్ నాయకులు చల్లా శ్రీనివాస్, తాటి బిక్షం, పడగల నవీన్, ఎం.డి. యాకూబ్, ఉల్లంగి సతీష్, శివరాత్రి ఎల్లయ్యతో పాటు టీజీఎంఐడీసీ డీఈ, ఏఈ, నిర్మాణ కాంట్రాక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story