భూష్మి శ్రీకాంత్ నేర సామ్రాజ్యం బట్టబయలు

by Ratna Kumari |   (  Updated:2026-07-18 11:34:40  IST  )

40 చోరీ కేసుల్లో ప్రమేయం ఉన్న అంతర్‌రాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు ఛేదించి ఆరుగురిని అరెస్టు చేశారు.

భూష్మి శ్రీకాంత్ నేర సామ్రాజ్యం బట్టబయలు
X

దిశ, నల్లగొండ క్రైం: రెండు తెలుగు రాష్ట్రాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ అంతర్‌రాష్ట్ర నేరస్థుడు భూష్మి శ్రీకాంత్ అలియాస్ అమ్మిరాజు రూపొందించిన నేర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలు, నగదు, రెండు టీవీలు ,రెండు సౌండ్ బార్స్,ఐదు ద్విచక్ర వాహనాలు, (7)మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ వెల్లడించారు. ఇటీవల అరెస్టైన మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు భూష్మి శ్రీకాంత్‌ను విచారించగా అతని నేర కార్యకలాపాలకు సంబంధించిన అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలంగాణ, 28 ఆంధ్రప్రదేశ్ 12 మొత్తం 40 చోరీ కేసులకు పాల్పడిన అతని ముఠాను పట్టుకునేందుకు,జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం. జితేందర్ రెడ్డి, చంద్రశేకర్ రెడ్డి, మిర్యాలగూడ రూరల్ సి‌ఐ ప్రసాద్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఆంఐజనేయులు, మాడ్గులపల్లి ఎస్ఐ యాదవ్ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు నిర్వహించారు. నిరంతర నిఘా, కచ్చితమైన సమాచార సేకరణ ఫలితంగా ముఠాలోని ఆరుగురు సభ్యులనుపిడుగురాళ్ల, అంజనీపురం, మండేపూడి(v) అమరావతి లలో శనివారం ర ఉదయం సుమారు 9.00 గంటలకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి.

యువకులను మభ్యపెట్టి నేరాల వైపు నడిపించిన శ్రీకాంత్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాలు మరింత సంచలనంగా ఉన్నాయి. భూష్మి శ్రీకాంత్ విజయవాడ, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నల్గొండ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వైన్ షాపుల వద్ద పరిచయమైన యువకులను లక్ష్యంగా చేసుకునేవాడు. మొదట వారికి మద్యం తాగించడం, డబ్బులు ఖర్చు పెట్టడం, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని సహాయం చేస్తున్నట్లు నమ్మకం కల్పించడం ద్వారా వారిని తనకు దగ్గర చేసుకునేవాడని విచారణలో తేలిందన్నారు. అనంతరం "తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం చోరీలే" అంటూ ప్రలోభపెట్టి నేరాల వైపు మళ్లించేవాడన్నారు.

అంతేకాకుండా తాళాలు ఎలా పగులగొట్టాలి, ఎలాంటి ఇళ్లను లక్ష్యంగా ఎంచుకోవాలి, రాత్రి వేళల్లో ఎలా చోరీ చేయాలి, పోలీసుల కదలికలను ఎలా గమనించాలి, సీసీటీవీ కెమెరాలను ఎలా తప్పించుకోవాలి, చోరీ చేసిన బంగారం, వెండిని ఎక్కడ విక్రయించాలి వంటి అంశాలపై కూడా తన అనుచరులకు శిక్షణ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇలా మొత్తం తొమ్మిది మంది సభ్యులతో శ్రీకాంత్ ఈ ముఠాను ఏర్పాటు చేసినట్లు గుర్తించడం జరిగింది. వీరిలో తమ్మిశెట్టి నాగరాజు మినహా మిగిలిన యువకులకు గతంలో ఎలాంటి నేరచరిత్ర లేదని తెలిపారు. నిందితుడు (A -3) నాగరాజు పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో గతంలో 10 కి పైగా కేసులు కలవు మరియు ఒక డెకాయిటీ కేసు లో ఇతనికి 7 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడినది. ఇట్టి శిక్ష కాలం లో ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో భూష్మి శ్రీకాంత్ తో పరిచయం యేర్పడినది. శిక్ష పడిన ఇతని ప్రవర్తనలో మార్పురాకపోగా, కరుడు గట్టిన నేరస్థుడు బుష్మి శ్రీకాంత్ @ అమ్మిరాజు తో జత కట్టి, భూష్మి శ్రీకాంత్ కు ఆశ్రయం కల్పించి అతని తో కలిసి నేరాలకు పాల్పడినాడు అని విచారణలో తేలిసినది.

ఈ ముఠా సభ్యులు ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా ఎంచుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడేవారని, రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నల్గొండ జిల్లా పోలీసుల నిఘా, సాంకేతిక విశ్లేషణ, ప్రతి చిన్న ఆధారాన్ని కీలక సమాచారంగా మలిచి నిరంతర దర్యాప్తు ఫలితంగా ఈ నేర ముఠానుప్రారంభ దశలోనే గుర్తించి చట్టం ముందు నిలబెట్టడంతో భవిష్యత్ లో జరిగే అవకాశం ఉన్న పలు ఆస్తి నేరాలను నివారించగలిగామని తెలిపారు.

పట్టుబడిన నేరస్థుల వివరాలు .. 1).తమ్మిశెట్టి నాగరాజు, s/o శ్రీనివాసులు, వయస్సు. 32, ఓక్. లారీ డ్రైవర్, r/o. మారుతీ నగర్ 1వ లైన్, పిల్లోట్ల రోడ్, పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా2).అల్లంశెట్టి సాయి కిరణ్ @ పాండు, s/o లక్ష్మణ్ రావు, వయస్సు. 22, Occ: లేబర్, r/o. మసీదు దగ్గర, అంజనీపురం (వి), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం.,.3).సమంతపు వెంకట అశోక్ s/o వెంకయ్య సూరి, వయస్సు. 33,Occ: పురోహిత్యం, r/o. H.No. 7-77, అంజనీపురం (V), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం4).ఆలేటి కోటేశ్వర్ రావు, s/o యేసు, వయస్సు. 22, Occ. ఆటో డ్రైవర్, r/o. గ్రామ సచివాలయం దగ్గర, 2వ బజార్, పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం5).సపావత్ నాగ కిరణ్ బాబు నాయక్, s/o శ్రీరాములు నాయక్, వయస్సు. 31, Occ.ఆటో డ్రైవర్, r/o. H.No. 1-208, మండేపూడి, అమరావతి మండలం, పల్నాడు జిల్లా.,6).పిల్లి రాజేష్ s/o పిల్లి నాంచారయ్య, వయస్సు. 25, Occ. బైక్ మెకానిక్, r/o. అంబేద్కర్ కాలనీ, పల్నాడు జిల్లా పెద కూరపాడు మండలంపరారీలో ఉన్న నేరస్తుల వివరాలు7).గాడిబోయిన గోపి సాయి S/o గోపి, వయస్సు. 22, Occ.ఆటో డ్రైవర్, r/o. లక్ష్మీ నగర్, పల్నాడులోని పిడుగురాళ్ల మండ. ప్రస్తుత r/o. నల్గొండ జిల్లా దామెరచెర్ల. (పరారీలో ఉన్నాడు)8).తమ్మండ్ర రమేష్ s/o ప్రమాణానందం, వయస్సు. 34, Occ. ఆటో డ్రైవర్, r/o. బత్తిలా రోడ్, ఇందిరమ్మ కాలనీ , పిడుగురాళ్ల మండలం, పల్నాడు జిల్లా (పరారీలో ఉన్నాడు).

నేరాలు చేసిన ప్రదేశాలు : నిందితులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మిర్యాలగూడ రూరల్, మిర్యాలగూడ I టౌన్, మిర్యాలగూడ II టౌన్, నల్గొండ I టౌన్, వాడపల్లి, తిప్పర్తి, మాడ్గులపల్లి, చండూర్, కనగల్, డిండి, నరసారావుపేట, సంతమంగలూరు, ఇబ్రహీంపట్నం ఎన్‌టీఆర్ జిల్లా, మద్దిపాడు, ఫిరంగిపురం, సింగరాయికొండ, అద్దంకి, కొల్లిపార, నల్లపాడు, బాపట్ల, పిడుగురాళ్ల, విజయవాడ పోలీస్ స్టేషన్ పరిధుల్లో మొత్తం 40 ఆస్తి నేరాలకు పాల్పడ్డారు.దర్యాప్తులో భాగంగా 12 వేర్వేరు నేర సంఘటనల ప్రదేశాల్లో లభించిన వేలిముద్రలు నిందితుల వేలిముద్రలతో సరిపోలినట్లు నిర్ధారణ అయింది. అదేవిధంగా పలు నేర ఘటనల్లో సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా కూడా నిందితులను గుర్తించడం జరిగింది .

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. "నేరస్థుడు ఎంత తెలివిగా ముఠాను నిర్మించినా, ఎంత జాగ్రత్తగా నేరాలకు పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోలేడు. ప్రతిచిన్నఆధారాన్నికీలకసమాచారంగామలిచి నిరంతర దర్యాప్తు ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థమైన దర్యాప్తు, ప్రజల సహకారంతో ప్రతి నేరస్థుడిని చట్టం ముందు నిలబెడతాం. యువత తప్పుడు ప్రలోభాలకు లోనై నేరాల వైపు వెళ్లకుండా జాగ్రత్తపడాలి" అని సూచించారు. ఈ అంతర్‌రాష్ట్ర చోరీ ముఠాను అత్యంత సమర్థవంతంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసినఈ ముఠా ను చాకచక్యంగా పట్టుకున్నసీసీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎం.జితేందర్రెడ్డి, డి.చంద్రశేకర్ రెడ్డి, మిర్యాల్గూడ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, నిడుమనూర్ ఎస్ఐ విజయకుమార్, సి‌సి‌ఎస్ ఎస్‌ఐ యూ.సురేశ్ సి‌సి‌ఎస్ సి‌బ్బంది హెచ్ సీఎస్ విష్ణువర్ధనగిరి, పుష్పగిరి, నాగరాజు, వహీద్ పాషా ఫయాజ్, పీసీఎస్ శివరాజ్, నరేష్, గులాందస్తగిరి, కమల్ కిశోర్, సాయి, జునైద్, నాగరాణి ఆశ్రర్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి వీరికినగదు బహుమతులుమరియు ప్రశంసా పత్రాలు ప్రకటించారు.

Next Story