- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య....
by Taduka Kalyani |
యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

X
దిశ, చిన్నకోడూరు : యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని చంద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దరిపల్లి శ్రీనివాస్(33) సిద్దిపేటలోని ఓ బట్టల షాపులో కొంతకాలంగా పనిచేశాడు. గత మూడు నెలల నుంచి హైదరాబాద్ వెళ్లి పని చేసుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి తండ్రి నరసయ్య గతంలో మరణించడంతో తల్లి నరసవ్వ ఒకరే ఉన్నారు. మృతికి గల కారణాలు ప్రేమ విఫలమై ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






