- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ కొండచిలువ! వాకర్లను ఆశ్చర్యపరిచిన అరుదైన దృశ్యం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్‌లో సుమారు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్‌లో (KBR) శనివారం ఉదయం సుమారు 20 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ కనిపించి వాకర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉదయం నిత్య నడకకు వచ్చిన వాకర్ల కళ్లముందే ఆ భారీ కొండచిలువ పార్కులోని ఒక వాకింగ్ ట్రాక్‌ను నెమ్మదిగా దాటింది. ట్రాక్‌ను పూర్తిగా దాటేందుకు ఆ పాము కొన్ని నిమిషాల సమయం తీసుకోవడంతో అక్కడ ఉన్నవారు ఆశ్చర్యంగా వీక్షించారు. ఈ అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించారు. ఈ ఘటన నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పార్క్‌లో సమృద్ధిగా వన్యప్రాణులు నివసిస్తున్నాయనే విషయాన్ని ఈ ఘటనే ఒక తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు.
Next Story






