ఎస్ ఐ ఆర్-2026 కార్యక్రమాన్ని పరిశీలించిన జోనల్ కమిషనర్

by Kodari Anjali |

ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ) వికాస్ మహతో, ఐఏఎస్ శనివారం చంపాపేట్ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎస్ ఐ ఆర్-2026 కార్యక్రమాన్ని పరిశీలించిన జోనల్ కమిషనర్
X

దిశ, చంపాపేట్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం అమలును ఎల్‌బీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ ) వికాస్ మహతో, ఐఏఎస్ శనివారం చంపాపేట్ డివిజన్‌లో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బైరమల్, సాయిరాం నగర్, దుర్గా నగర్‌తో పాటు పలు కాలనీలలో కొనసాగుతున్న ఇంటింటి ఓటరు ధృవీకరణ, నమోదు, సవరణ ప్రక్రియలను పరిశీలించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ లు) నిర్వహిస్తున్న పనితీరును తెలుసుకుని, వారికి అవసరమైన సూచనలు చేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్ఓలకు ఆదేశించారు. ప్రతి అర్హుడైన ఓటరిని జాబితాలో నమోదు చేయడంతో పాటు, ఓటరు వివరాల సవరణ, మార్పులు, కొత్త నమోదులను నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని సూచించారు. ప్రజలు కూడా ఎస్ ఐ ఆర్ -2026 కార్యక్రమానికి సహకరించి, అవసరమైన పత్రాలు సమర్పించి తమ ఓటరు వివరాలను సరిచూసుకోవాలని వికాస్ మహతో విజ్ఞప్తి చేశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు.

Next Story