- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీవారి ఆలయం వద్ద ఉల్లంఘనలు.. కేసు నమోదు
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో శుక్రవారం తమిళ సంప్రదాయం ప్రకారం ఆణివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయం(Tirumala SriVaru Temple) వద్ద నిబంధనలు ఉల్లంఘించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. తిరుమలలో శుక్రవారం తమిళ సంప్రదాయం ప్రకారం ఆణివార ఆస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం తమిళనాడు శ్రీరంగం దేవస్థానికి చెందిన పది మందికి మహాద్వారం ప్రవేశం కల్పించడంతో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే ఆలయంలోకి వెళ్లిన వ్యక్తులు నిబంధనలు ఉల్లంఘించారు. ఒకరికి బదులు మరొకరు స్వామివారి వద్దకు వెళ్లారు. దీంతో టీటీడీ విజిలెన్స్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
టీటీడీ విజిలెన్స్ సీరియస్
ఈ నేపథ్యంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు సీరియస్ అయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోనేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఎవరు ఆలయంలోకి వెళ్లారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగవంగా శ్రీవారి ఆలయం వద్ద సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. అనంతరం చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.






