- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారు మయంగా మలచుకోవాలి
విద్యార్థులు నైపుణ్య అభివృద్ధి ద్వారా తమ భవిష్యత్తును బంగారు మయంగా మలచుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు.

దిశ, కాగజ్ నగర్: విద్యార్థులు నైపుణ్య అభివృద్ధి ద్వారా తమ భవిష్యత్తును బంగారు మయంగా మలచుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. శనివారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గల ఎస్పీఎం క్లబ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఎంపిక చేసుకోవలసిన కోర్సులు, ఉన్నత విద్య అవకాశాలపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు విశ్రాంత వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్ అనురాధ, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారి చెన్నూరి కృష్ణయ్య, కెరీర్ మిత్ర ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్ లో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఆయా కోర్సులలో చేరడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలలో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, మనలో ఉన్న నైపుణ్యతను మెరుగు పరచుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని తెలిపారు. ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్లవలసిన అవసరం లేదని, మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచుకోవచ్చని తెలిపారు. కెరీర్ మిత్ర ఫౌండేషన్ వారు అందించే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, కెరీర్ గైడెన్స్ లెటిస్ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి వంటి వాటిని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సులను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ఒకచోట ఆగిపోకుండా నిత్యం ప్రయత్నించాలని, తద్వారా లక్ష్యసాధన సులభతరం అవుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు నైపుణ్యతకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నరసింహస్వామి, ఫౌండేషన్ సభ్యులు వంశీకృష్ణ, పళ్ళ విజయ్ కుమార్, మెరుగు శ్రీకాంత్, మణికుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.






