Badminton : జపాన్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు

by Harish |

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది.

Badminton : జపాన్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు
X

దిశ, స్పోర్ట్స్ : భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు జపాన్ ఓపెన్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. టోర్నీలో ఆమె ఫైనల్‌కు చేరుకుంది. జపాన్ ఓపెన్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. శనివారం జరిగిన సెమీస్‌లో సింధు.. చైనాకు చెందిన చెన్ యుఫెయ్‌తో తలపడింది. అయితే, ఆట మధ్యలోనే చెన్ యుఫెయ్ గాయం కారణంగా తప్పుకోవడంతో సింధు ముందడుగు వేసింది. ప్రత్యర్థి రిటైర్ అవ్వకముందు ఆటలో సింధు హవా చాటుతోంది. తొలి గేమును 21-19తో గెలిచింది. అదే జోరును రెండు గేములో కూడా కొనసాగించింది. 15-10తో ఆధిక్యంలో ఉంది. ఆ సమయంలో చెన్ యుఫెయ్ కండరాల గాయంతో మ్యాచ్‌ నుంచి విత్ డ్రా అయ్యింది. ఆదివారం జరిగే ఫైనల్‌లో సింధు.. జపాన్ స్టార్ క్రీడాకారిణి యమగూచితో తలపడనుంది. సింధు ఓ టోర్నీలో విజేతగా నిలిచి రెండేళ్లు అవుతోంది. 2024‌లో ఆమె సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ సాధించింది. ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేదు. ఆ టోర్నీ తర్వాత ఫైనల్‌ ఆడటం కూడా మొదటిసారి.


Next Story