ఓఆర్ఆర్ పై అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు

by Taduka Kalyani |

ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఓఆర్ఆర్ పై అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టిన కారు
X

దిశ, రాజేంద్రనగర్ : ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా దూసుకెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం నుంచి తమ స్నేహితుడు దుబాయ్ కి వెళ్లేందుకు శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. స్నేహితుడికి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు స్విఫ్ట్ డిజైర్ కారులో మిత్రులు బయలుదేరారు. గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా హిమాయత్ సాగర్ వద్ద అతివేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ ఖాజా (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా స్నేహితులు జమీర్, యాకూబ్, అక్బర్ తీవ్ర గాయాలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఖాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story