పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు ఎటు పోయాయ్.. కేటీఆర్‌కు చామల కౌంటర్

by Ajay Maddhiboyina |

సరూర్ నగర్ యువసంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిధులు, నియామకాలు ఎటుపోయాయని ప్రశ్నించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిధులు, నియామకాలు ఎటు పోయాయ్.. కేటీఆర్‌కు చామల కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: సరూర్ నగర్ యువసంగ్రామ సదస్సులో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ చామల కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నిధులు, నియామకాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేటీఆర్ మాయమాటలు చెప్పి మళ్లీ ప్రజల మనసులో స్థానం సంపాదించుకోవాలని చూస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ మేకతోలు కప్పుకున్న తోడేళులా కనిపిస్తున్నాడని విమర్శించారు. గత ప్రభుత్వంలో మీ పాలన చూసే ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. గత ప్రభుత్వంలో పేపర్ లీక్ లు జరిగితే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించారన్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఎందమందికి ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో డబ్బులు దండుకుని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని తిట్టడానికి ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ముందు మీ హయాంలో ఏం చేశారో చెప్పాలన్నారు. జూబ్లిహిల్స్ ఎన్నికల్లో తామే గెలుస్తామని జబ్బలు చర్చుకున్నారని, ఇప్పుడు వచ్చే ఎన్నికలపై కూడా అలానే కలలు కంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే మీరు పార్టీ పెట్టారని చెప్పారు. ఉద్యమ సమయంలో ఉద్యమకారుల కుటుంబాలను మీరు ఎంతలా పట్టించుకున్నారో మాకు తెలియదా అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని తిడితే హీరో అవుతానని అనుకోవడం పిచ్చేనని అన్నారు.

Next Story