శంషాబాద్ బహదూర్‌‌గూడలో మరోసారి ఉద్రిక్తత.. పోలీసులపై కారం చల్లి దాడి చేసిన రైతులు

by Ajay Maddhiboyina |

శంషాబాద్ బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూసేకరణ విషయంలో పోలీసులకు రైతులకు మధ్య వివాదం నెలకొంది.

శంషాబాద్ బహదూర్‌‌గూడలో మరోసారి ఉద్రిక్తత.. పోలీసులపై కారం చల్లి దాడి చేసిన రైతులు
X

దిశ, వెబ్డ డెస్క్: శంషాబాద్ బహదూర్‌గూడలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ కోసం 600 ఎకరాల భూసేకరణ విషయంలో పోలీసులకు రైతులకు మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రైతులు పోలీసులపై కారం చల్లి రాళ్లు, కుర్చీలు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో డీసీపీ యోగేష్ గౌతమ్ సహా పలువురు సీఐలకు గాయాలు అయ్యాయి. శంషాబాద్ లో ఉదయం నుండి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. బుల్లెట్ ట్రైన్ కోసం తమ భూములు ఇవ్వబోమని రైతులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉదయం ఆ భూములు తీసుకునేందుకు హైడ్రా అధికారులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకోవడంతో రైతులు ప్రతిఘటించారు. దీంతో ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అది కాస్తా సాయంత్రానికి తీవ్రరూపం దాల్చింది. ఇక ఇదే అంశంపై ఐదు రోజులుగా రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తరవాతనే భూములను తీసుకోవాలని చెబుతున్నారు. బీఆర్ఎస్ రైతులకు మద్దతు ఇస్తుండటంతో భూసేకరణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.

Next Story