- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతోనే రెండేళ్ల ప్రయాణం విజయవంతం..
by Kodari Anjali |
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో రెండేళ్ల పదవి కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

X
దిశ, చొప్పదండి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో రెండేళ్ల పదవి కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అందించిన సహకారం, ఆశీస్సులు జీవితంలో ఎప్పటికీ మరువలేనివని అన్నారు. సేవే ధ్యేయమని, ప్రజల అభివృద్దే లక్ష్యమని ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పని చేస్తానని అన్నారు. ఈ పదవి కాలంలో రైతులు, ప్రజలు, నాయకులు, పాత్రికేయులు, శ్రేయోభిలాషులు, అధికారులు, మార్కెటింగ్ సిబ్బంది, ట్రేడర్స్, హమాలీల సహకారంతోనే కమిటీ కార్యకలాపాలు సజావుగా సాగాయని పేర్కొన్నారు. ఈ ఆదరణ, అభిమానం ఎప్పటికి ఇలాగే కొనసాగాలని కోరారు. అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు మహేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Next Story






