మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

by Kodari Anjali |

వివిధ తరగతులు, ఇంటర్ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.

మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!
X

దిశ, మనకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ & జూనియర్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతులు, ఇంటర్ గ్రూపుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విభాగంలో 6వ తరగతిలో 33, 7వ తరగతిలో 22, 8వ తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ-5, బైపీసీ-10, సీఈసీ-10, ఏసీఈలో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 20వ తేదీన అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాఠశాల కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీట్ల భర్తీ పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరుగుతుందని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు.

Next Story