అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్టు రద్దుకు భక్తుల నిరసన

by Ratna Kumari |

భూదాన్ పోచంపల్లిలో అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్టు రద్దు చేసి కొత్త సూచన కమిటీ ఏర్పాటు చేయాలని భక్తులు నిరసన తెలిపారు.

అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్టు రద్దుకు భక్తుల నిరసన
X

దిశ, భూదాన్ పోచంపల్లి : భూదాన్ పోచంపల్లి పురపాలక కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయ ట్రస్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేవాలయం ఎదుట గురుస్వాములు, అయ్యప్ప భక్తులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో దేవాలయానికి ఎలాంటి ట్రస్టు లేదని పేర్కొన్న కొందరు వ్యక్తులు, ప్రస్తుతం తామే ట్రస్టు సభ్యులమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విధానాన్ని భక్తులు, గురుస్వాములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధి, పరిరక్షణే లక్ష్యంగా ప్రస్తుతం ఉన్న ట్రస్టును పూర్తిగా రద్దు చేయాలని భక్తుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో దేవాలయ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా నూతన సూచన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు గంగపురం వెంకటేష్ గౌడ్, బొడిగె బాబు, భోగ విష్ణు, శెట్టి శ్రీనివాస్, వంగూరి పాండు, కొయ్యడ శ్రీను, దోర్నాల గణేష్, ముప్పిడి శ్రీనివాస్, శంకర్, వీరేష్, కీర్తి సంజీవ్, అంకం వినోద్, అంకం సాయి, చెక్క సాయి తదితరులు పాల్గొన్నారు.

Next Story