జూలై 20న ప్రజావాణి కార్యక్రమం రద్దు

by Taduka Kalyani |

ఈ నెల 20వ తేదీ సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశంనిర్వహించనున్న నేపథ్యంలో, అదే రోజు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

జూలై 20న ప్రజావాణి కార్యక్రమం రద్దు
X

దిశ,సంగారెడ్డి అర్బన్: ఈ నెల 20వ తేదీ సోమవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశంనిర్వహించనున్న నేపథ్యంలో, అదే రోజు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షపాతం, పంటల సాగు, గ్రౌండ్ వాటర్, విద్యుత్, తాగునీటి సరఫరా, సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణ చర్యలు తదితర అంశాలపై జిల్లా అధికారులు,ప్రజాప్రతినిధులతో ఈ సమీక్ష సమావేశం జరగనుంది.తదుపరి సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా నిర్వహించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.

Next Story