- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏఐఓబీసీఎస్‌ఏ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు.

దిశ, సికింద్రాబాద్: ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ నాయకత్వం నియామకాన్ని ప్రకటించింది. నియామకం అనంతరం యాచారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు గౌడ కిరణ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు, ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా, ఉపాధి అవకాశాల విస్తరణ, సామాజిక న్యాయం, రాజ్యాంగబద్ధ హక్కుల అమలు కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా, మండలం, కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో సంఘాన్ని బలోపేతం చేసి, ఓబీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఓబీసీ విద్యార్థులంతా సంఘం ఆధ్వర్యంలో ఐక్యంగా ముందుకు వచ్చి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని యాచారం గణేష్ గౌడ్ పిలుపునిచ్చారు.






