- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
పెండింగ్ లో ఉన్న ఒక ఏడాది బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

దిశ, హిమాయత్ నగర్: ప్రభుత్వ కార్యాలయ అద్దె వాహనాల రెంట్ ను 34 వేల నుండి 55 వేలకు పెంచాలని , పెండింగ్ లో ఉన్న ఒక ఏడాది బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ హైర్ వెహికిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొని , మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో 9 ఏళ్ల క్రితం నిర్ణయించిన ధరలు ఇప్పటికి కొనసాగుతున్నాయని... 9 ఏళ్ల క్రితం 64 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర , ఇప్పుడు రెట్టింపు అయిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు , కుటుంబ పోషణ వ్యయం పెరిగిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కారు డ్రైవర్ జీతం 70 వేలు ఉంటుందని , దాని నిర్వహణకు అదనంగా 30 వేలు అవుతుందన్నారు. అద్దె వాహనాలకు 34 చెల్లిస్తున్న ప్రభుత్వానికి కనీస సృహ ఉండాలన్నారు. రేటు పెంపు , బకాయిల విడుదలపై డిప్యూటీ సీఎం ను కలిసి , సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఆర్ కృష్ణయ్య హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజుల నుండి అద్దె వాహన యజమానులు చేస్తున్న సమ్మెను ఉపసంహరించాలని ఆర్ కృష్ణయ్య సూచించారు. వచ్చే నెల వరకు ప్రభుత్వం వీరి సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సభ్యులు మొహమ్మద్ అలీ, అక్బర్, రాజు, రవి యాదవ్, ఎస్కే పాషా, గౌస్ పాషా, బీసీ సంఘం నాయకులు నీల వెంకటేష్, అనంతయ్య, మోడీ రాందేవ్, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.






