- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముక్కులో చాక్‌పీస్.. చిన్నారిని కాపాడిన 108 సిబ్బంది
by Batti.Sumithra |
ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో నూతన్‌కల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆటల మధ్య చాక్‌పీస్‌ను ముక్కులో పెట్టుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.

X
దిశ, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలో నూతన్‌కల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆటల మధ్య చాక్‌పీస్‌ను ముక్కులో పెట్టుకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే మాజీ ఎస్‌ఎంసీ చైర్మన్‌కు సమాచారం అందించడంతో పాటు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 108 ఈఎంటీ యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్‌ను సురక్షితంగా తొలగించారు. దీంతో చిన్నారి క్షేమంగా బయటపడింది. సకాలంలో స్పందించి చిన్నారిని ప్రమాదం నుంచి కాపాడిన 108 సిబ్బందిని తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






