- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపదలో అండగా ఉంటా : చెట్టిపెళ్లి వెంకటేశ్వర్లు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నాయకత్వంలో మండలంలోని ప్రతి కార్యకర్తకు ఆపదలో అండగా ఉండి కంటిపాపలా కాపాడుకుంటానని మండల పార్టీ అద్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు.

దిశ, మంగపేట : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నాయకత్వంలో మండలంలోని ప్రతి కార్యకర్తకు ఆపదలో అండగా ఉండి కంటిపాపలా కాపాడుకుంటానని మండల పార్టీ అద్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని జబ్బోనిగూడెంలో ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడు జబ్బ వెంకటేశ్ కుటుంబాన్ని జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి ఆయన దశదిన కర్మలకు 5 వేల ఆర్దిక సహాయం అందజేశారు. ఆపదలో ఉండే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూజారి సురేందర్ బాబు, పగిడిపల్లి వెంకటేశ్వర్లు, బాసారికారి హరికృష్ణ, బొరయ్య, సుధాకర్, ఎడ్ల నరేష్, నరేష్, సతీష్, చంటి, కబ్బాక లక్ష్మణ్, భానుచందర్, నాగార్జున, సోషల్ మీడియా ఇంచార్జ్ భూక్య కుమార్ పాల్గొన్నారు.






