- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు తక్కువ.. టీచర్లు ఎక్కువ
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండడం తరచూ చూస్తుంటాం.

దిశ, లింగంపేట: సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి టీచర్లు తక్కువగా ఉండడం తరచూ చూస్తుంటాం. కానీ విద్యార్థులు తక్కువగా ఉండి టీచర్లు ఎక్కువగా ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని బానాపూర్ గ్రామంలో ఉంది. లింగంపేట మండలంలో మొత్తం 71 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 4391 మంది పిల్లలు చదువుతుండగా 325 ముందు టీచర్లు విద్యను బోధిస్తున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో 123 బాలికలు ఉండగా కేవలం ఐదుగురు టీచర్లు మాత్రమే ఉన్నారు. మోతే తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 161 మంది పిల్లలు ఉండగా 8 మంది టీచర్లు పనిచేస్తున్నారు.
కన్నాపూర్ తాండ ప్రాథమిక పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులకు గాను ఇద్దరు టీచర్లు ఉన్నారు. బానాపూర్ తాండ ప్రాథమిక పాఠశాలలో ఏడుగురు విద్యార్థులకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. మండలంలోని పర్మల్ల ప్రాథమిక పాఠశాలలో 108 మంది విద్యార్థులు ఉండగా కేవలం ఐదుగురు టీచర్లు ఉన్నారు. లొంకలపల్లి ప్రాథమిక పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు ఉండగా ఒక టీచర్ పనిచేస్తున్నాడు. బానాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్‌లో మాత్రం ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా 9 మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు.ఇక్కడ ఒక్కో విద్యార్థికి ఒక్కో సబ్జెక్టు టీచర్ ఉండగా మరొకరు హెడ్మాస్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.






